శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (22:16 IST)

జలుబు, దగ్గు, ఆయాసంగా వున్నవారు ఇది చేస్తే ఉపశమనం..

మనకు ప్రకృతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. అరికాళ్లు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు గానీ నెయ్యి గానీ సొరకాయ గుజ్జు గానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
 
2. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
 
3. పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరించడం వల్ల కొంత తగ్గుతుంది.
 
4. చిటికెడు పసుపు గ్లాసు పాలల్లో వేసి కాచి ప్రతిరోజు ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది. 
 
5. తులసి ఆకుల రసంలో ఒక స్పూను తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతునొప్పి, దగ్గు వెంటనే తగ్గుతాయి.
 
6. కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గిపోతుంది.
 
7. క్యారెట్ రసాన్ని, నిమ్మ రసాన్ని సమపాళ్లల్లో తీసుకుని భోజనానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల ముక్కు సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందవచ్చు.