మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (14:50 IST)

తలనొప్పి తగ్గాలంటే.. రోజుకు నాలుగు జీడిపప్పుల్ని?

రోజుకు నాలుగు జీడిపప్పులను నమిలితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. జీడిపప్పుల్లో కేలరీలు అధికంగా వున్నాయి. ఇందులోని పీచు పదార్థాలు, విటమిన్లు, ఐరన్, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం ఆరోగ్యానికి తగిన శక్తినిస్తాయి. 
 
జీడిపప్పుల్లోని పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కారకాలను తొలగిస్తాయి. రోజూ నాలుగు లేదా ఐదేసి జీడిపప్పులను నమిలితే.. రక్తపోటు సక్రమంగా వుంటుంది. కిడ్నీరాళ్లు ఏర్పడటాన్ని తగ్గించుకోవచ్చు. శరీరంలోని కణాలకు జీడిపప్పు ఎంతో మేలు చేస్తాయి. 
 
జీడిపప్పులోని గుడ్ కొలెస్ట్రాల్ హృదయానికి మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే జీడిపప్పును రోజు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా వుంటాయి. దంతాలు, చిగుళ్లకు జీడిపప్పు ఆరోగ్యాన్నిస్తుంది. హైబీపీ, కండరాల పట్టివేత, మైగ్రేన్ తలనొప్పి వంటి రుగ్మతలను జీడిపప్పు దూరం చేస్తుంది. కంటికి, చర్మానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.