శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (11:19 IST)

ఉడికించిన వంకాయ తీసుకుంటే..?

వంకాయను పలురకాల వంటకాల్లో వాడుతుంటారు. కూరగాయలన్నింటి కంటే వంకాయలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వంకాయలు ఎరుపు, పచ్చ, నలుపు వంటి రంగుల్లో కూడా ఉన్నాయి. వంకాయను కూర రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. వంకాయలోని ప్రయోజనాలు ఓసారి చూద్దాం.
 
కప్పు వంకాయ ముక్కల్లో ఫైబర్ 3 గ్రాములు, ప్రోటీన్స్ 1 గ్రా, మాంగనీస్ 10 శాతం, విటమిన్ కె, సి, పొటాషియం వంటి ఖనిజాలున్నాయి. దీంతో పాటు మెగ్నిషియం, న్యూట్రియన్స్, కాపర్ అధిక మోతాదులో ఉన్నాయి. తరచు వంకాయ తీసుకుంటే గుండె జబ్బుల నుండి విముక్తి లభిస్తుంది. వారానికి రెండుసార్లు వంకాయ తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చును. 
 
రక్తనాళాలకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వంకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం, పచ్చిమిర్చి, టమోటా, చింతపండు, నూనె, ఉల్లిపాయ వేసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి తీసుకుంటే చాలా రుచిగా బరువు కూడా తగ్గుతారు. వంకాయలోని ఫైబర్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. 
 
దీనిని ఉడికించు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. తద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. కడుపునొప్పిగా ఉన్నప్పుడు వంకాయ ముక్కల్లో కొద్దిగి ఉప్పు, కారం కలిపి నూనెలో వేయించి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది.