శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (12:58 IST)

శీతాకాలం జలుబు, దగ్గు- నువ్వుల నూనెలో వేపాకు మరిగించి ఇలా చేస్తే..?

ఈ చలికాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే.. దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలే. వీటి కారణంగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఈ వ్యాధుల నుండి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
 
1. అల్లం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి పదార్థాలు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. అల్లం తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. 
 
2. అల్లాన్ని నీటిలో కడుక్కుని దాని తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత నీటిని మరిగించి అందులో ఈ అల్లం ముక్కలు, కొద్దిగా పటిక బెల్లం, కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్నివడగట్టి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. 
 
3. అల్లాన్ని మెత్తని పొడిలా చేసుకుని అందులో స్పూన్ మిరియాల పొడి, పసుపు, దాల్చిన చెక్క పొడి, యాలకులు, కరివేపాకు పొడి వేసి మిశ్రమంగా తయారుచేసుకుని స్పూన్ మోతాదులో రోజూ అన్నంలో కలిపి తింటే దగ్గు సమస్య రాదు. 
 
4. ఇక ఈ సీజన్‌లో స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. ఒకవేళ తీసుకుంటే తప్పకుండా జలుబు, దగ్గుకు గురవుతారు. దాంతో అనేక రకాల రోగాలతో సతమతమవుతుంటారు. కనుకు ఎక్కువగా వీటిని తీసుకోకండి.
 
5. నువ్వుల నూనెలో కొన్ని వేపాకులు వేసుకుని మరిగించుకోవాలి. ఈ నూనె చల్లారిన తరువాత నుదిటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. తద్వారా శరీర ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.