సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (21:19 IST)

జుట్టుకు రంగు వేసేవారు ఏం చేయాలో తెలుసా?

స్టైల్ కోసం కొందరు, తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు ఇటీవలి కాలంలో రంగు వేసుకోవడం ఎక్కువైంది. ఐతే ఇలా రంగు వేయడం వల్ల క్యుటికల్ డ్యామేజ్ అవుతుంది. జుట్టు చిట్లిపోతుంది. చిక్కులు పడుతాయి. మెరుపు కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

మరీ దెబ్బతిన్న క్యుటికల్‌ను బాగు చేయడం ఎలా అంటే సింపుల్ పద్ధతి ఒకటుంది. అదేమిటంటే... క్రమం తప్పకుండా నూనెతో తలకు మర్దన చేయాలి. దీన్నే డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. 
 
తలకు నూనె పెట్టకుండా తలస్నానం చేయడం వల్ల కూడా జట్టు పొడిబారిపోతుంది. రంగు కూడా త్వరగా పోతుంది. అందువల్ల జుట్టుకు రంగు వేసుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.