Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాధినిరోధక శక్తికి మునగాకును తీసుకుంటే? (video)

మాంసకృత్తులు, విటమిన్స్, ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరబాటు. అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఇవన్నీ లభిస్తాయిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో క్యాల్షియ

Written By Kowsalya
Updated: శుక్రవారం, 20 జులై 2018 (18:28 IST)
మాంసకృత్తులు, విటమిన్స్, ఇతర పోషకాలు ఖరీదైన ఆహారంలో మాత్రమే ఉంటాయనుకోవడం పొరబాటు. అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఇవన్నీ లభిస్తాయిని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో క్యాల్షియం, ఇనుముతో పాటు ఇతర ఆరోగ్యకరమైన మాంసకృతులు విలువైన ఖనిజాలు అధికమోతాదులో లభిస్తాయి.
 
ఎముకలు దృఢంగా మారేందుకు సహాయపడుతాయి. పిల్లల్లో ఎముక సాంద్రత పెంచేందుకు దోహదపడుతాయి. మునగాకు గింజలలో రక్తశుద్ధికి తోడ్పడే లక్షణాలు ఉన్నాయి. మధుమేహ బాధితులు మునగాకును ఆహారంగా తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. గాల్‌బ్లాజర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
 
మునగాకు ఆకులలో, పువ్వులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి అధికమోతాదులో లభించడం వలన ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వలన నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అదుపులో ఉంటాయి. గర్భాశయంలో వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
 
శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మునక్కాయలను తరచుగా తీసుకుంటే మంచిది. శరీర వ్యర్థాలను బయటకు పంపించగల శక్తి మునగాకుకి ఉంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు మునగాకును సూప్‌గా తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. మహిళలు గర్భం దాల్చినప్పుడు మునక్కాయను తప్పనిసరిగా తీసుకోవాలి.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జరిగిన అమెజాన్ వార్షిక సమావేశంలో మీర్జాపూర్ తారల సందడి

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

First baby girl in 200 years: 200 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ.. పండగ చేసుకున్నారు..

Sabarimala Gold Case: శబరిమలలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు బెయిల్

కొండా సురేఖ ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments