శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (14:00 IST)

రోజూ అరకప్పు పప్పు.. స్నాక్స్‌గా ద్రాక్షపండ్లు, స్ట్రాబెర్రీలు తీసుకుంటే?

మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూ అరకప్పు పప్పును ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని ప్రోటీన్లు, ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. అందుకే రోజుకు అరకప్పు మోతాదులో పప్పును తప్పకుండా తీసుకోవా

మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూ అరకప్పు పప్పును ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులోని ప్రోటీన్లు, ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. అందుకే రోజుకు అరకప్పు మోతాదులో పప్పును తప్పకుండా తీసుకోవాలి. కానీ మోతాదు మించిన పప్పు కూరలను ఆహారంలో చేర్చుకోకూడదు. అలాగే స్నాక్స్‌గా కేక్, కుకీస్, క్యాండీస్ వంటివి కాకుండా స్ట్రాబెర్రీ, ద్రాక్షపండ్లు తీసుకోకూడదు. జ్యూసుల్లో పంచదారను చేర్చుకోకూడదు. 
 
పిండిపదార్థాలు గ్లూకోజ్ స్థాయిలు అధికంగా గల వైట్ బ్రెడ్‌ను మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోకూడదు. ఇలాంటి వైట్ బ్రెడ్‌ల నుండి వచ్చే కార్బోహైడ్రేట్లను తీసుకోవడం కంటే వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు. కేక్‌, రొట్టెలలో షుగర్, సోడియం, తీపి పదార్థాలు అధికంగా ఉంటాయి.
 
ఇలా చక్కెర స్థాయిలు పెరగటం వలన ఇన్ఫ్లమేషన్‌లు కలుగవచ్చు. వీటివలన శరీరంలో కొవ్వు స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉంది. వేయించిన ఆహారాల పదార్థాల జోలికి వెళ్ళకూడదు. బంగాళదుంప, ఫ్రెంచ్ ఫ్రైలు మధుమేహ వ్యాధిగ్రస్తులలో బరువును పెంచుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.