ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 18 జనవరి 2020 (22:01 IST)

అల్లంతో ఎన్నో ప్రయోజనాలు కానీ అలా తింటే అపాయం...

ఆకలిలేమి, వేవిళ్లు, అజీర్తి వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు అల్లం యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అల్లం కంటే శొంఠిలో ఎక్కు ఔషధ గుణాలున్నాయి. అల్లం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదర పేగులో చేరే క్రిములను నశింపజేస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. ఆకలిలేమితో బాధపడేవారు.. అల్లం, కొత్తిమీర తరుగుతో పచ్చడి తయారుచేసుకుని తీసుకోవడం మంచిది. 
 
గొంతునొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది. కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి. ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు. అల్లం పచ్చడి గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది. అల్లం రసంలో బెల్లం కలుపుకుని తాగితే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త, అజీర్తి దూరమవుతుంది. నోటి దుర్వాసన ఉండదు. చురుగ్గా ఉంటారు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
అల్లం తొక్కను తీసేయకుండా అలానే దంచేస్తే మాత్రం అపాయం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే? అల్లం తొక్కలో విషపదార్థాలుంటాయట. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని.. అందుకే అల్లం ఉపయోగించేటప్పుడు తొక్క తీసేయడం చాలా మంచిదని వారు చెప్తున్నారు.