శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 జనవరి 2020 (20:24 IST)

బియ్యం కడిగిన నీళ్లలో అల్లం రసం, తేనె కలిపి

మనలో చాలామంది చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లిపోతుంటారు. కానీ అలాంటివాటికి మన ఇంట్లో లభించే వస్తువులతోనే సమస్యను అధిగమించవచ్చు. అవేమిటో చూద్దాం.
 
1. తీవ్రమైన జ్వరం, డిహైడ్రేషన్ ఉన్నవారికి ఈ రసంలో మెంతికూర, తులసి రసం, తేనె కలిపి ఇస్తే త్వరిత ఉపశమనం లభిస్తుంది.
 
2. మాంసాహారం తిని అరగక ఇబ్బందిపడుతుంటే పాలకు బదులు అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే సరిపోతుంది.
 
3. చెంచా అల్లం రసంలో పావుచెంచా జీలకర్ర, తేనె వేసి తీసుకున్నట్లైతే తలతిరగడం, పైత్యం, వికారం వల్ల అయ్యే వాంతులు, దురద, కాలేయ సమస్యలు తగ్గుతాయి.
 
4. నెలసరి నొప్పితో బాధపడేవారు పదిరోజుల ముందు నుంచి వేణ్నీళ్లలో అల్లం రసం వేసి తీసుకున్నట్లైతే నొప్పి నుండి ఉపసమనం కలుగుతుంది.
 
5. కొబ్బరి నీటిలో అల్లం రసం కలిపి తీసుకున్నట్లైతే మూత్రవిసర్జన సమయంలో మంట సమస్య తగ్గుతుంది.
 
6. గొంతు ఇన్‌ఫెక్షన్, నోటిపూత ఉన్నవారు బియ్యం కడిగిన నీళ్లలో అల్లం రసం, తేనె కలిపి తాగాలి.
 
7. భోజనం చేసిన తరువాత చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగకుండా, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
 
8. అరగ్లాసు పాలల్లో అల్లం, పుదీనారసం సమపాళ్లలో కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది.