Daily Horoscope
✕

కడుపు పండాలంటే.. ద్రాక్షపండ్లు ఎక్కువగా తీసుకోండి...

ద్రాక్ష పండ్లలో పిండిపదార్థాలు, చక్కెర పదార్థాలతో పాటు విటమిన్ -ఎ, విటమిన్-బి1 విటమిన్లు పుష్కలంగా వుంటాయి. విటమిన్ సి, విటమిన్-కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలు మెండుగా

Written By Selvi
Updated: ఆదివారం, 27 ఆగస్టు 2017 (16:59 IST)
ద్రాక్ష పండ్లలో పిండిపదార్థాలు, చక్కెర పదార్థాలతో పాటు విటమిన్ -ఎ, విటమిన్-బి1 విటమిన్లు పుష్కలంగా వుంటాయి.  విటమిన్ సి, విటమిన్-కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. ద్రాక్ష వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండ సమస్యలతో బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
 
కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడం, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఆస్తమా, గుండె జబ్బులు, అజీర్ణం, మైగ్రేయిన్‌.. ఇలా చాలా రోగాలకు ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లుగానే తినడంతో పాటు పానీయంగా, సలాడ్లుగా కూడా ద్రాక్షను తీసుకోవడం మంచిది.
 
సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు.. ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్‌లు పుష్కలంగా వుండటంతో సంతానలేమిని దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

రూ.2లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ఇన్స్‌స్పెక్టర్

Ban Rs. 500 Notes? I 500 రూపాయల నోట్ల ఉపసంహరణపై స్పందించిన ఏపీ సీఎం బాబు

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోయారు.. ఫ్యాన్స్‌కు షాక్

ఆన్‌లైన్‌లో తితిదే క్యాలెండర్లు - డైరీలు విక్రయం

ఎన్వీడియా చీఫ్‌పై గూఢచర్యం ఆరోపణలు - మా దేశంపై కుట్ర : చైనా ధ్వజం

అన్నీ చూడండి

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

Pawan Kalyan and Sreeja :అందుకే పవన్ కళ్యాణ్ విడిపోయారు - బాబాయ్ బాటలో అమ్మాయి కూడా ? : వేణుస్వామి

Pawan Kalyan and Anna diverced: పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్, అన్నా కొనిడాల విడిపోతున్నట్లు ప్రకటన

Imanvi Ismail and Prabhas :ఫౌజీ చిత్రం కోసం రొమాంటిక్ పెళ్లి సన్నివేశం చిత్రీకరణ !

తర్వాతి కథనం
Show comments