గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (11:29 IST)

మెదడు ఆయుష్షును పెంచే బీట్ రూట్...

బీట్‌ రూట్ మెదడు ఆయుష్షును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మెదడు చురుకుగా ఉండాలంటే.. వ్యాయామం చేసేందుకు ముందు కాస్త బీట్‌రూట్ రసం తాగాలి. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాయామం

బీట్‌ రూట్ మెదడు ఆయుష్షును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మెదడు చురుకుగా ఉండాలంటే.. వ్యాయామం చేసేందుకు ముందు కాస్త బీట్‌రూట్ రసం తాగాలి. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాయామం చేసేప్పుడు త్వరగా అలసిపోకుండా చూడటానికి, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి తోడ్పడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ చాలా శక్తిమంతమైంది.
 
బీట్ రూట్ రసంతో రక్తపోటు తగ్గుతున్నట్లు గత అధ్యయనాల్లో వెల్లడి అయ్యింది. ఇది కూడా మెదడుకు మేలు చేసేదే. కాబట్టి బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇది మన శరీరంలో ఆక్సిజన్ అవసరమైన భాగాల్లోకి చొచ్చుకొని వెళ్తుంది. ఆక్సిజన్‌ను పెద్ద మొత్తంలో వినియోగించుకునే అవయవం మెదడు కావడంతో బీట్‌రూట్ మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ ముందు నైట్రైట్‌గానూ, అనంతరం నైట్రిక్‌ ఆక్సైడ్‌గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.