శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (13:12 IST)

చిక్కుడును వంటల్లో చేర్చుకుంటే?

ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవాలంటే చిక్కుడును వంటల్లో చేర్చుకోవాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. చర్మ వ్యాధులు, నొప్పులను తగ్గించే గుణం చిక్కుడులో వుంది. చిక్కుడులో ఇనుము పుష్కలంగా వున్నాయి. చిక్

ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవాలంటే చిక్కుడును వంటల్లో చేర్చుకోవాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. చర్మ వ్యాధులు, నొప్పులను తగ్గించే గుణం చిక్కుడులో వుంది. చిక్కుడులో ఇనుము పుష్కలంగా వున్నాయి. చిక్కుడు శరీరంలో కొవ్వు చేరకుండా చేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది. దంత సమస్యలను చిక్కుడు దూరం చేస్తుంది. 
 
చిక్కుడులోని ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేగాకుండా.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కరిగిపోయే పీచును కలిగివున్న ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా చేస్తుంది. చిక్కుడులో అధిక ప్రోటీనులు, డైటరీ ఫైబర్ బరువును తగ్గిస్తుంది. చిక్కుడులోని ఐరన్ రక్తనాళాలకు కావలిసినంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. 
 
చిక్కుడులోని కాపర్, ఐరన్ రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతాయి. ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకల బలాన్ని ఇస్తాయి. చిక్కుళ్లలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా క్యాన్సర్లను దరిచేరనివ్వదు. చిక్కుడు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.