మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (16:38 IST)

శారీరక శ్రమ తక్కువ-మానసిక ఒత్తిడి ఎక్కువ.. ఏం చేద్దాం?

కంప్యూటర్ల ముందు అదే పనిగా గంటలు గంటలు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూనే వున్నాయి. ఇలా కంప్యూటర్లకు అతుక్కుపోయే వారిలో ఒబిసిటీ సమస్య వేధిస్తుంది. అలా

కంప్యూటర్ల ముందు అదే పనిగా గంటలు గంటలు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూనే వున్నాయి. ఇలా కంప్యూటర్లకు అతుక్కుపోయే వారిలో ఒబిసిటీ సమస్య వేధిస్తుంది. అలా మీరు కూడా బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటే.. అరగంట పాటు వ్యాయామం చేయాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మానసిక ఒత్తిడి అధికమవుతున్న తరుణంలో.. అరగంట పాటు వ్యాయామం చేయాలి. కుదిరితే కాసేపు పరిగెత్తాలి. లేదంటే నడవాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా వుంటుంది. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది. అధిక రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. గుండె జబ్బులు దరిచేరవు. 
 
టైప్-2 మధుమేహం, కుంగుబాటు వంటివి నియంత్రణలో వుంటాయి. వ్యాయామం ఒత్తిడిని దూరం చేస్తుంది. స్కిప్పింగ్ చేయడం, ఏరోబిక్ చేయడం, స్విమ్మింగ్, జుంబా, కర్ర, తాడుతో చేసే వ్యాయామాలు చేసినా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇలా చేస్తే నాజూగ్గా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా వుండొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.