శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (16:21 IST)

సీతాఫలాన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా?

సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలున్నాయి. సీతాపండును నీరసంగా ఉన్నప్పుడు తీసుకుంటే.. శారీరానికి కావలసిన గ్లూకోజ్ అందుతుంది. సీతాపండులో ఎలాంటి కొవ్వు వుండదు కాబట్టి వారానికి రెండు సార్లు ల

సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలున్నాయి. సీతాపండును నీరసంగా ఉన్నప్పుడు తీసుకుంటే.. శారీరానికి కావలసిన గ్లూకోజ్ అందుతుంది. సీతాపండులో ఎలాంటి కొవ్వు వుండదు కాబట్టి వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు సీతాఫలాన్ని డైట్లో చేర్చుకోవచ్చు. తద్వారా అలసట దూరమవుతుంది. గుండె పనితీరును ఈ పండు మెరుగుపరుస్తుంది. 
 
ఈ పండులో కాపర్, ఇనుము, ఫాస్పరస్ లాంటి ఖనిజాలున్నాయి. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. సీతాఫలం గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది.
 
కానీ ఆస్తమా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే బాగా పండిన పండును తింటే ఎలాంటి బాధా ఉండదు. లివర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి. ఇందులోని గ్లూకోజ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అంత మంచిది కాదు. సీతా ఫలంలోని విటమిన్ ఎ.. కంటి, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
చర్మం తాజాగా వుంటుంది. ఇందులోని మెగ్నీషియం కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. ఇంకా సీతాఫలంలోని ఇనుము రక్తహీనతను నయం చేస్తుంది. సీతాపండులోని రాగి, ఇనుమ రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా సీతాఫలం నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.