తాగుడు అలవాటున్న వారిని మాన్పించాలంటే..?

మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. బిపి, షుగర్, అధిక బరువు లాంటి ఆరోగ్య సమస్యలే కాకుండా తాగుడుకు బానిసలైన వారి ఆరోగ్యాన్ని కాపాడి వారిని ఆ అలవాట్ల నుంచి దూరం చేయడంలోను మెంతులు బాగా ఉపయోగపడతాయి.

శనివారం, 28 అక్టోబరు 2017 (15:19 IST)
మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. బిపి, షుగర్, అధిక బరువు లాంటి ఆరోగ్య సమస్యలే కాకుండా తాగుడుకు బానిసలైన వారి ఆరోగ్యాన్ని కాపాడి వారిని ఆ అలవాట్ల నుంచి దూరం చేయడంలోను మెంతులు బాగా ఉపయోగపడతాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల కాలేయం పూర్తిస్థాయిలో చెడిపోతుంది.
 
ఆల్కహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికితోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ, మూత్ర పిండాల సమస్య కూడా తోడవుతుంది. తాగుడుకు బానిసలైన వారిని మెంతులతో ఈజీగా రక్షించుకోవచ్చు. తాగుడు అలవాటున్న వారికి రెండు స్పూన్ల మెంతిగింజలను సుమారు నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తరువాత ఉడకబెట్టి కొద్దిగా తేనె కలిపి తినిపించాలి.
 
ఇలా చేస్తే దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవచ్చు. దానికితోడు మిశ్రమాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే మెంతుల్లోని చేదు, జిగురు తత్వాలు మద్యం అంటేనే ఒకరకరమైన అసహ్యాన్ని కలిగించేలా చేస్తాయి. ఎంత మద్యపానప్రియులైనా ఈ మెంతులను తిన్నాక మద్యం జోలికి అస్సలు వెళ్ళరు. మద్యంపైన ఆలోచన వెళ్ళినప్పుడు మెంతులతో చేసిన డికాక్షన్ తాగించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులను కలిపి తాగిస్తే తాగుడు అలవాటు నుంచి దూరం చేస్తాయి.

అన్నీ చూడండి

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments