1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: శనివారం, 22 జులై 2017 (15:54 IST)

మద్యాన్ని మాన్పించడం చాలా ఈజీ... ఎలాగంటే?

మద్యానికి అలవాటుపడిన వారినెవరినైనా సరే ఈజీగా మార్చేయవచ్చు. అదెలాగో చూడండి... మద్యానికి అలవాటు పడిన వారు అస్సలు ఒక పట్టాన మానరు. మెంతులు ఎప్పుడూ మన వంటింట్లో అందుబాటులో ఉంటాయి. మానవ శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉండేలా చేసేవి మెంతులు.

మద్యానికి అలవాటుపడిన వారినెవరినైనా సరే ఈజీగా మార్చేయవచ్చు. అదెలాగో చూడండి... మద్యానికి అలవాటు పడిన వారు అస్సలు ఒక పట్టాన మానరు. మెంతులు ఎప్పుడూ మన వంటింట్లో అందుబాటులో ఉంటాయి. మానవ శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉండేలా చేసేవి మెంతులు. బిపి, షుగర్ అధిక బరువు లాంటి సమస్యలనే కాకుండా తాగుడుకు బానిసైన వారిని బయటకు తీసుకొస్తాయి మెంతులు. 
 
మద్యం ఎక్కువగా సేవించే వారిలో కాలేయం దెబ్బ తింటుంది. రక్తనాళాలు చెడిపోతాయి. శ్వాస వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనికితోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దాంతో పాటు కిడ్నీ, మూత్రపిండాల సమస్య కూడా తోడవుతుంది. తాగుడు అలవాటు ఉన్నవారికి రెండు చెంచాల మెంతులను నీటిలో కలిపి రెండుగంటల నానబెట్టి ఆ తరువాత తేనె కలిపి ఇవ్వాలి. దీని కారణంగా దెబ్బ తిన్న కాలేయాన్ని కాపాడుకోవచ్చు. దానికితోడు ఈ మిశ్రమాన్ని క్రమం తిప్పకుండా తీసుకుంటే మెంతుల్లో ఉండే చేదు, జిగురు తత్వాలు తాగుడంటే అసహ్యం అయ్యే భావన తెస్తాయి. ఎంత మద్యం ప్రియులైనా ఖచ్చితంగా మద్యాన్ని మానేస్తారు.