శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: సోమవారం, 6 మే 2019 (13:01 IST)

మామిడికాయలు వచ్చేశాయ్... తొక్కు తీసిన మామిడి పండ్లు తింటే ఏమవుతుంది?

మామిడి పండ్ల కాలం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మామిడికాయలు కనబడుతున్నాయి. ఐతే తొక్కులేని మామిడి పండ్లను తినడం వల్ల ఒబిసిటీని నిరోధించవచ్చని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు. బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లను తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని వారు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
 
మామిడి పండు పైనున్న తోలు (తొక్క)ను మాత్రం పక్కన బెట్టి కేవలం లోపల ఉన్న గుజ్జును మాత్రం తింటే తప్పకుండా బరువు తగ్గుతారని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 
 
మామిడి పండు తోలులో కాంపౌండ్లు అధికంగా ఉండటం ద్వారా తొక్కతో తీసుకోవడం మంచిది కాదంటున్నారు. అదే తోలు తీసేసిన మామిడిలో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయని వారు చెపుతున్నారు. అందువల్ల తోలు లేని మామిడి పండు ఊబకాయం తగ్గేందుకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.