శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:07 IST)

తలనొప్పిని తగ్గించే బంగాళాదుంప.. పొటాటో జ్యూస్‌ని తీసుకుంటే?

బంగాళాదుంప తినేందుకు రుచిగా వుండటమే కాకుండా.. అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బంగాళాదుంపలు గుండె వ్యాధుల నిరోధించటానికి బంగాళాదుంప ఎంత‌గానూ స‌హాయ‌ప‌డుతుంది. అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు కూడా బంగాళాదుంపలో లభిస్తాయి.
 
ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది. క్యాన్సర్‌తో బాధపడే వారు కూడా బంగాళాదుంప జూస్ తాగ‌డం వ‌ల్ల వీటిలో ఉండే యాంటీ క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా నివారిస్తుంది. 
 
బంగాళాదుంపలో ఉండే పిండిపదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధి, రక్తపోటు వంటి అనేక ర‌కాల జ‌బ్బులను త‌గ్గించ‌డంలో మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా త‌లనొప్పి ఉప‌శ‌మ‌నానికి బంగాళాదుంప మంచి రెమిడీగా ప‌ని చేస్తుంది. 
 
పొటాటో జ్యూస్ మైగ్రేన్ తలనొప్పిని దూరం చేస్తుంది. స్వీట్ పొటాటోలో పుష్కలమైన న్యూట్రీషియన్లు దాగివుంటాయి. అందుకే తలనొప్పిగా వున్నప్పుడు పొటాటో జ్యూస్‌ను తీసుకోవడం ఉపశమనాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.