మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (12:20 IST)

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

star fruit
స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది,ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్త నాళాల్లోని అడ్డంకులను, హైబీపీని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూడటానికి సహాయం చేస్తుంది.
 
స్టార్ ఫ్రూట్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గిపోతుంది.
 
కాబట్టి బరువు తగ్గాలని కోరుకునే వారికి ఈ పండ్లు ఉత్తమమైన ఎంపిక అని చెప్తున్నారు. స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్ బి6 శరీర మెటబాలిజంను పెంచుతుంది. మహిళలు స్టార్ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఫిట్‌నెస్‌గా వుంచుకోవచ్చు. ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మెదడు ఉత్తేజకరంగా మారి యాక్టివ్‌గా పనిచేస్తుంది. మిమ్మల్నీ ఉత్సాహంగా ఉంచుతుంది.