ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2025 (23:02 IST)

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

deadbody
కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ లైఫ్ సపోర్టుతో జీవిస్తూ, వైద్యం చేస్తున్నా కోలుకోలోని రోగులు గౌరవంగా చనిపోయే హక్కు (కారుణ్య మరణం)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్నాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ హక్కును ప్రసాదించే ముందు రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. 
 
ప్రాథమిక బోర్డులోని ముగ్గురు వైద్యులు రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది వైద్యులతోపాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు కనుక అంగీకరిస్తే వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగి లైఫ్ సపోర్ట్‌ను తొలగించి అతడు ప్రశాంతంగా చనిపోయే అవకాశం కల్పిస్తారు. 
 
అయితే, సంబంధిత రోగి బంధువులు కోరిన మీదటే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోలుకోలేని రోగులకు దీర్ఘకాలిక బాధల నుంచి విముక్తి కల్పించడంపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు.. ఇలాంటి వారికి గౌరవప్రదంగా చనిపోయే హక్కును కల్పించాలని ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావ్ తన ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు. కోలుకోలేని ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్న రోగులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన గుర్తుచేశారు.