1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : బుధవారం, 18 మే 2016 (15:45 IST)

రక్త ప్రసరణ వేగాన్ని పెంచే హెల్తీ వెజిటేబుల్... బీట్‌రూట్

బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్. మనకు సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. శక్తినిచ్చే శాఖాహారదుంపల్లో బీట్‌రూట్‌ది మొదటి స్థానం. బీట్‌ రూట్‌‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్నిఅరికడుతుంది. 
 
అంతేకాదు బీట్ రూట్‌లోని పుష్కలమైన ఐరన్, వ్యాధి నిరోధకతకు పెంచుతుంది, కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోజుకి ఓ గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదపడుతుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. 
 
గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది. ఆరోగ్యంగా గడపడానికి శక్తిచాలా అవసరం. అటువంటి శక్తిని అందించడంలో బీట్ రూట్ బాగా పనిచేస్తుంది. బద్దకంగా అనిపిస్తుంటే బీట్ రూట్‌‌ని చిన్న చిన్న స్లైస్‌గా కట్ చేసి తింటే దాంతో తక్షణ శక్తిని పొందగలుగుతాం.