Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు పూటలా 20 మి.లీ తులసి రసంలో అది కలిపి తీసుకుంటే...

Written By సిహెచ్
Updated: శనివారం, 2 ఫిబ్రవరి 2019 (21:27 IST)
తులసిని పరమ పవిత్ర దేవతా స్వరూప మొక్కగా లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావించి ఆరాధించడం మన దైనందిన జీవన విధానంలోని శ్రేష్ఠమైన అత్యున్నతమైన సదాచారం. తులసిని సంపదకి, సౌభాగ్యానికి చిహ్నంగా భావించడంతో పాటు ఆ తల్లి కరుణాకటాక్షవీక్షణాలు మన శారీరక, మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ విశ్వసిస్తాం. ఈ తులసిలో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
 
1. 200 మి.లీ.ల నీటిలో గుప్పెడు తులసి ఆకులు, ఒక టీ స్పూను పంచదార కలిపి 100 మి.లీ.ల నీరు మిగిలేలా సన్నని మంట పైన మరిగించి వడకట్టి పూటకు 50 మి.లీ.ల టొప్పున సేవిస్తుంటే దగ్గు, జలుబు, జ్వరాలు తగ్గుతాయి.
 
2. 100 మి.లీ మరుగుచున్న నీటిలో పది తులసి ఆకులు, ఒక గ్రాము యాలుకుల పొడి వేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తేనె కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
 
3. వారానికోసారి రాత్రిపూట తలకి తులసి రసం పట్టించి ఉదయం తలస్నానం చేస్తుంటే పేల సమస్య తగ్గుతుంది. రొజూ రెండు పూటలా పూటకు 20 మి.లీ తులసి రసంలో 5 మి.లీ తేనె కలిపి తీసుకుంటుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 
 
4. రోజూ ఒకసారి 100 మి.లీ నీటిలో 10 తులసి ఆకులు, అర టీస్పూను అతిమధుర చూర్ణం, అర టీ స్పూను తాటి కలకండ వేసి మరిగించి దించి చల్లార్చి వడకట్టి 100 మి.లీ కాచిన పాలు కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు సమృద్ధిగా ఏర్పడతాయి.
 
5. నీడలో ఎండించి వస్త్ర గాలితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని రోజూ రెండు పూటలా పూటకు 1-2 గ్రాముల వంతున తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఇదే చూర్ణాన్ని ముక్కుపొడుంలా పీలుస్తుంటే ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, తలనొప్పి, సైనసైటిస్ వంటి వ్యాధులు తగ్గుతాయి.

అన్నీ చూడండి

పాకిస్తాన్ తిక్క చేష్టలు, ప్రధాని మోడి ఫోటోను కత్తిరించి శునకానందం

Fake Currency Racket: నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. ఎక్కడంటే?

ఎలాగూ చేసుకున్నావుగా, ఇంకేం చేస్తాం ఇంటికిరా అల్లుడూ అని చెప్పి హత్య చేసారు

తితిదే డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు, కోట్లలో ఆస్తులు గుర్తింపు

రైతులు - టీచర్లను అమానవీయంగా చూశారు.. కేసులు ఎత్తేస్తాం : సీఎం విజయ్

అన్నీ చూడండి

స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్: గేమ్ కాదు.. ఈసారి బిగ్ స్క్రీన్ ఫైట్

Mamitha Baiju hospitalzed: మమితా బైజు ఆసుపత్రిలో చేరిక, ఓనమ్ వేడుకలు వాయిదా !

మా రాముడు అందరివాడు చిత్రం విజయం సాధిస్తుంది : సుమన్, శ్రీరామ్

దశావతారం థీమ్‌తో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. కంటిస్టెంట్లు వీరే..

తెలుగు ప్రజలు మెచ్చే నాయకుడుగా ఎదగాలి : తమ్ముడుకు అన్నయ్య బర్త్‌డే విషెస్

తర్వాతి కథనం
Show comments