గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (14:13 IST)

తుమ్ములకు చెక్ పెట్టే కొత్తిమీర..

శీతాకాలంలో జలుబుతో తుమ్ములు రావడం సాధారణం. అలాంటప్పుడు కొత్తిమీర దివ్యౌషధంగా పనిచేస్తుంది. సువాసనలు వెదజల్లే కొత్తిమీర ఆకులతో వాసన పీల్చుకోవడం ద్వారా తుమ్ముల నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కొత్తిమీర శరీరంలో వేడిని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. శరీరంలోని ఉష్ణతాపాన్ని తగ్గించడంతో కొత్తిమీర మెరుగ్గా పనిచేస్తుంది. 
 
కఫం, వాత, పిత్త వ్యాధులను కొత్తిమీర దూరం చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. కొత్తిమీర ఆకులను గుప్పెడు తీసుకుని నీటిలో బాగా మరిగించి.. సేవించడం ద్వారా జలుబును దూరం చేసుకోవచ్చు. కొత్తిమీర మధుమేహాన్ని నియంత్రిస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. 
 
అలాగే కొత్తిమీర క్యాన్సర్ కారకాలను దరిచేరనివ్వదు. నోటి అల్సర్‌కు కొత్తిమీర చెక్ పెడుతుంది. అల్జీమర్స్‌ను దూరం చేసుకోవాలంటే కొత్తిమీరను రోజూ ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.