మంగళవారం, 22 జులై 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 24 జూన్ 2016 (15:13 IST)

తెల్ల ద్రాక్ష పళ్లతో ఊబకాయం దూరం

నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్య

నీటి శాతం అధికంగా ఉండే తెల్ల ద్రాక్ష పండ్లును రోజూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ సమస్యను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలోనూ ద్రాక్ష పండ్లు దివ్యౌషధంగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 
 
శరీరంలోని కొవ్వును కరిగించడంలోను ద్రాక్ష కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పండ్లకు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజున... కొన్ని ద్రాక్ష పండ్లను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.