గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 1 జులై 2017 (18:27 IST)

వర్షాకాలంలో వేడినీళ్లు ఎందుకు తాగాలి?

వర్షాకాలం అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వేడినీళ్లు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చెమటలు

వర్షాకాలం అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వేడినీళ్లు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చెమటలు పడతాయి. ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది.
 
* బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత ఉపశమనం కలిగిస్తుందో మీరే గమనించవచ్చు.
 
* నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతుంది.
 
* ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని తాగాలి. వర్షాకాలంలో ఇబ్బందిపెట్టే జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బందిపడేవారు గోరువెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. దీనిద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ఉపశమనం కలుగుతుంది.