మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (13:35 IST)

యోగాసనాలు వేస్తే... ఊబకాయం నుండి...

ఊబకాయం అన్నది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తొంది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు అనేవి కొందరిలో ఈ ఊబకాయాన్ని కలిగిస్తుంటాయి. అలాగే మరికొందరిలో కొన్ని రకాల హార్మోన్ల ప్రభావం వలన రకరకాల వ్యాధు

ఊబకాయం అన్నది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తొంది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు అనేవి కొందరిలో ఈ ఊబకాయాన్ని కలిగిస్తుంటాయి. అలాగే మరికొందరిలో కొన్ని రకాల హార్మోన్ల ప్రభావం వలన రకరకాల వ్యాధులతో ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దేహంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండడం వలన ఊబకాయాని గురికానున్నారు.
 
ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారు ఆహార విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఊబకాయాన్ని తగ్గించేందుకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఈ ఊబకాయ సమస్యల నుండి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
 
జిమ్‌లకు వెళ్లడం, వైబ్రేషన్ బెల్ట్‌లు వాడడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం చాల కష్టంగా ఉంటుంది. ఈ రకమైన ఊబకాయం సమస్యలు ఉన్నవారు దాని నుండి బయటపడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటికి వ్యాధులతో బాధపడేవారికి యోగా చక్కగా ఉపయోగపడుతుందని యోగా నిపుణు చెబుతున్నారు.
 
యోగాసనాలు చేయడం వలన ఊబకాయ సమస్యలను సులభంగా దూరం చేయవచ్చును. యోగా నేర్చుకుని రోజూ ఓ నాలుగైదు రకాల ఆసనాలు వేయడం వలన ఊబకాయాన్ని చాల సమర్థంగా తగ్గించుకోవచ్చును. యోగాసనాలు ద్వారా కేవలం ఊబకాయం సమస్యలు మాత్రమే కాకుండా హైబీపీ, మధుమేహం లాంటి రుగ్మమతలను సైతం అదుపులో పెట్టవచ్చని యోగా నిపుణులు పేర్కొన్నారు.