సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (12:20 IST)

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమే కాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడ

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది.
 
ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి.