రోజుకు ఒక్క పండుతో బరువుకు చెక్...
సాధారణంగా అరటి పండు అంటే ఇష్టపడని వారుండరు. వీటిలో పలు రకాలు ఉన్నాయి. కానీ, ఆకుపచ్చ అరటి పండ్ల కంటే పసుపు పచ్చ రకం పండ్లు ఆరోగ్యాన్ని ఎంతో మేలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా అరటి పండు అంటే ఇష్టపడని వారుండరు. వీటిలో పలు రకాలు ఉన్నాయి. కానీ, ఆకుపచ్చ అరటి పండ్ల కంటే పసుపు పచ్చ రకం పండ్లు ఆరోగ్యాన్ని ఎంతో మేలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం వాటిలో అధిక పోషక పదార్థాలు ఎనిమిది రెట్లు అధికంగా ఉంటాయట. ఈ పండ్లను రోజుకు ఒకటి లేదా రెండు పండ్లు తీసుకుంటే సులభంగా బరువు తగ్గిపోవచ్చట. ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయి.
* ఆకుపచ్చ అరటిపండ్ల కంటే పసుపు పచ్చ రకం పండ్లలోనే పోషక పదార్థాలు 8 రెట్లు అధికం.
* రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం.
* రెండు అరటిపండ్లు తీసుకుంటే... 90 నిమిషాల పాటు వ్యాయం చేయగల శక్తి మనకు లభిస్తుంది.
* అరటిపండ్లలో అధిక పిండిపదార్థాలు ఉంటాయి.
* మధుమేహ వ్యాధిగ్రస్తులు వాటిని తినడం ఏమాత్రం మంచిదికాదు.
* కానీ బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒక అరటిపండుతో సరిపెట్టుకోవడం మంచిది.
* అరటిలోని బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* వీటిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
* అరటిలోని ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.
* శరీరంలో అరటిపండు ఎంత పడితే అంత క్యాన్సర్ నిరోధక గుణాలు అధికమవుతాయి.