కొబ్బరికాయలతోనే సరి... హారతి లేకుండానే గోవిందా.. గోవిందా..

గురువారం, 3 సెప్టెంబరు 2015 (07:24 IST)
అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదూ అంటే తిరుమలలోని టీటీడీ టెంకాయల కొట్టులాగే ఉంటుంది. టెంకాయల కొట్టులో స్వామికి ఎంతో భక్తితో టెంకాయ, కర్పూరం అగబత్తులు, ఆకు వక్కా సమర్పిస్తుంటాం. ఇది సహజం. కానీ టీటీడీ కొట్టులో టెంకాయ మాత్రమే చేతిలో పెట్టి తూరుపు తిరిగి దండం పెట్టుకోమని చెబుతున్నారు. 
 
తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం భక్తులు అఖిలాండం వద్ద కర్పూరం, అగర్‌ బత్తీలతో కొబ్బరికాయ సమర్పిస్తుంటారు. వీటిని ప్రయివేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయకుండా టీటీడీ కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఇంతవరకూ చాలా బాగుంది. ప్రైవేటు వ్యాపారాల కారణంగా భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారనే ఉద్దేశ్యంతో తామే కొట్టును ఏర్పాటు చేశారు. 
 
ఇక్కడ గతంలో రూ.10కే కర్పూరం, అగర్ బత్తీలు, కొబ్బరికాయ ఇచ్చేవారు. ఇటీవల దాని ధరను రూ.15కు పెంచారు. టీటీడీ కౌంటర్లలో కొబ్బరికాయలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు నిలిపేస్తారో తెలియదు. ఇచ్చే కొబ్బరి కాయ పెద్ద గోళీ గుండుకు ఎక్కువ గుండ్రాయికి తక్కువ. కనీసం పిడికిట నిండా కూడా ఉండవు. 
 
అదీ కేవలం కొబ్బరి కాయ మాత్రమే ఇస్తున్నారు. అగర్ బత్తీ, కర్పూరం ఇవ్వటం లేదు. అదేమంటే స్టాకు లేదనే సమాధానం వస్తోంది. దీంతో భక్తులు కేవలం కొబ్బరికాయతో అసంపూర్తిగా మొక్కులు చెల్లించి వెనుదిరిపోతున్నారు. 

అన్నీ చూడండి

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments