పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో జరిగినవి ఏమిటి?

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానానుసారమే సమాజంలో అనేక వింతలు విశేషాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన విషయాలను ఓసారి పరికిస్తే పోతులూరి కాలజ్ఞానంలో పేర్కొన్నట్టుగానే జరగడం గమనార్హ

సోమవారం, 19 జూన్ 2017 (16:49 IST)
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానానుసారమే సమాజంలో అనేక వింతలు విశేషాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన విషయాలను ఓసారి పరికిస్తే పోతులూరి కాలజ్ఞానంలో పేర్కొన్నట్టుగానే జరగడం గమనార్హం. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
భారతదేశాన్ని ఓ అంబ 16 యేళ్ల పాటు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంధీ దశాబ్దన్నర కాలానికిపైగా దేశ ప్రధానిగా ఉన్నారు). 
తెరమీద కదిలే బొమ్మలు గద్దెనెక్కుతాయి. ప్రజలను పాలిస్తారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (పలువురు సినీ నటులు పలు రాష్ట్రాలను పాలించారు). 
దేశంలో రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. (ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా రాజుల పాలన లేదు). 
ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు. (ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో ఎంతో కొంతమంది చనిపోతూనే ఉన్నారు). 
సమాజంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. (ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది).
బ్రాహ్మణ అగ్రహారాలు అంతరించిపోతాయి. (ఇపుడు దేశంలో బ్రాహ్మణ అగ్రహాలు ఎక్కడా కనిపించవు). 
హైదరాబాద్‌ నగరంలో తురకలు, హిందువులు ఒకర్నొకరు నరుక్కుని చచ్చిపోతారు. (హైదరాబాద్ నగరం మతకలహాలకు పెట్టింది పేరు). 
ఆలయాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దేశంలో అనేక ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురవుతున్నాయి). 
చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. (అన్ని రకాల యంత్రాలూ వచ్చినా.. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుగొనలేకపోయారు). ఇలాంటివి ఎన్నో జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. 

అన్నీ చూడండి

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు

నా ఫోటోతో తమిళనాట విజయ్ గెలిచారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాగా సమాధానం

అన్నీ చూడండి

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

తర్వాతి కథనం
Show comments