సామాన్యులకు పెద్దపీట.. ఒకే లైను.. గత అనుభవాలను పరిగణలోకి : ఈవో

బుధవారం, 31 డిశెంబరు 2014 (13:57 IST)
గత అనుభవాలు, తొక్కిసలాటలు, ఇబ్బందులు.. ఇలాంటవన్నీ తమ కళ్ల ముందు ఇంకా మెదలాడుతూనే ఉన్నాయనీ, తిరిగి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డి సాంబ శివరావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కేవలం అందరికీ ఒకే ఒక లైను మాత్రమే నడుపుతామని  అన్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలని నిర్ణయించామన్నారు. 
 
విఐపిల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉందని అయినప్పటికీ గతంలో వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకుని వారు అడినంత మందిని అనుమతించలేమని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వారి వెంట కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. వారు ఐదు మంది అనుమతించాలని కోరుతున్నా అది సాధ్య కాని పని అని అన్నారు. విఐపిలను తెల్లవారుజామున 1.45గంటల నుంచి 5 గంటల వరకూ అనుమతిస్తామన్నారు. అయితే వీలైతే వీరిని 4 గంటల లోపే పూర్తి చేసి ఆ సమయాన్ని కూడా సామాన్యులకు కేటాయిస్తామని చెప్పారు.
 
సామాన్యుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కనీసం 500 మంది టీటీడీ అధికారులను తిరమలకు బదలాయించినట్లు వివరించారు. దాదాపు 3200 మంది శ్రీవారి సేవకులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పని చేస్తారని చెప్పారు. రద్దీ అధికంగా ఉండి తొపులాట, తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నచోట్ల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అక్కడే అదనపు అధికారులు ఉంటారని చెప్పారు. 

అన్నీ చూడండి

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments