బాబూ..! మాటలు కాదు... దమ్ముంటే ప్రత్యేక హోదా తెప్పించు... శ్రీనివాస యాదవ్

శనివారం, 21 ఫిబ్రవరి 2015 (13:17 IST)
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన మాజీ బాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఫైరయ్యారు. దమ్ముధైర్యం లేకుండా బతుకుతున్నారని ఆరోపించారు. చట్టప్రకారం రాష్ట్రానికి రావలసినవి కూడా రాబట్టుకోలేక మాటలు చెబుతూ బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చట్ట ప్రకారం కూడా రావలసిన ప్రత్యేక హోదాను కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అడిగే ధైర్యం చంద్రబాబుల లేదని ఆయన అన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏంటని ఆయన ప్రశ్నించారు. 
 
రావలసినవి అడిగే ముఖ్యమంత్రి ఉండాలేగానీ, నిధులు రాబట్టుకోవడం పెద్ద పని కాదని ఆయన అన్నారు. అ శనివారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ముందు చంద్రబాబు నాయుడు తాను అసలు ఆంధ్రాకు ఏం చేస్తున్నారో. ఏం చేయగలుగుతున్నారో గుర్తు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి? తాను ప్రస్తుతం చేస్తున్నవి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పేందే చేస్తున్నదని అన్నారు. కానీ ఇక్కడ చంద్రబాబు అన్ని మాటలు చెబుతున్నారే తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు.  
 
ఆంధ్రప్రదేశ్ లో చేయాల్సిన పనులు చేయాలా ఉంటే ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సిటీలో ఉన్న వారందరూ హైదరాబాదీలంటే బాబుకు నొప్పి ఎందుకని ప్రశ్నించారు. అక్కడున్న ఆంధ్రులు తెలంగాణ వాసులే అనడంలో తప్పేంటని ప్రశ్నించారు. అక్కడ నుంచి వారిని తరిమేయాలనేది చంద్రబాబు ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. ఆయన దావోస్లు, జపాన్లు, చైనాలు తిరగడం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని తలసాని శ్రీనివాస యాదవ్ హితవు పలికారు. 
 

అన్నీ చూడండి

సజ్జనార్ ఐపీఎస్ షేర్ చేసిన ద్విచక్ర వాహన ప్రమాద వీడియో చూస్తే జన్మలో హెల్మెట్ లేకుండా వెళ్లరు

నీ కడుపులో వున్నది నా బిడ్డ కాదు, డీఎన్ఎ టెస్ట్ చేపిస్తా: భర్త వేధింపులకు గర్భిణి ఆత్మహత్య

కొత్తగా పెళ్లైంది.. కొండపైనున్న ఆలయానికి వెళ్లారు.. కోతుల గుంపు.. భయంతో నవవధువు మృతి

రాజ్ ఘాట్ వంతెనపై నుంచి గంగలో దూకేందుకు మహిళ, కాపాడిన యువకుడు, వీడియో

ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు జంప్ అవుతున్న విద్యార్థులు

అన్నీ చూడండి

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments