క్యూలైన్లు తనిఖీ చేసిన టీటీడీ ఈవో

శనివారం, 20 డిశెంబరు 2014 (21:48 IST)
వైకుంఠ ఏకాదశి దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు శనివారం సాయంత్రం తిరుమలలోని క్యూ కాంప్లెక్సులను తనిఖీ చేశారు. ఏటీజీహెచ్, వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి పుట్ పాత మార్గాలను ఆయన పరిశీలించారు. 
 
రెండు పర్వదినాలు ఒకే రోజు జనవరి 1, 2015 వస్తున్న కారణంగా తాము అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఈవో చెప్పారు. రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే తాము ఏర్పాట్లను తగు విధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు. కనీసం 40 వేల మంది కంపార్టుమెంట్లలో కూర్చునే సౌకర్యాలను పరిశీస్తున్నామని చెప్పారు. 
 
ఏటిజీహెచ్ నుంచి ఆలయం లోపలి వరకూ కనీసం 2.7 కిలోమీటర్లు దూరం ఉంటుందని ఈ ప్రాంతంలో సింగిల్ లైను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ ఈ రమేష్ రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అన్నీ చూడండి

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు 2 లక్షల మంది విద్యార్థులు

అన్నీ చూడండి

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments