గణపతి దేవా...! నీ నిమజ్జనానికి నీళ్ళేవి..?

శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (10:36 IST)
వర్షంలేదు. ఎక్కడా నీళ్ళు లేవు.. చెరువులు ఎండిపోయాయి. నా చవితెప్పుడో చప్పవయ్యా అంటూ గణపతి దేవుడు మాత్రం వచ్చేశారు. ఉత్సవాలు జరపమంటున్నారు. వినాయక చవితి మొదలయిపోతోంది. ఊరూర విగ్రహాలు తయారైపోతున్నాయి. అయితే ఎక్కడా చుక్క నీరు లేదు.  గణపతి దేవా నీటి కొరత రాకుండా చూసుకో తండ్రీ అంటూ ఆయనపై భారం వేసి భక్తులు విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
రాష్ట్రంలో జలాశయాలు అడుగంటే స్థితికి చేరుకున్నాయి. పెద్ద పెద్ద జలాశయాలే వెల్లకిలా పడ్డాయి. తుంగభద్ర జలాశయంలోకి వచ్చే నీటి ప్రవాహం రోజురోజుకూ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 75.1 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 4,885 క్యూసెక్కులకు మించి రావటం లేదు. కర్ణాటక, మనకూ కలిపి 8,100 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌ దగ్గర విడుదల చేస్తున్నారు.
 
అనంపురం జిల్లా సరిహద్దు దగ్గర 1,500 క్యూసెక్కుల నీరు అందుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే 14 టీఎంసీలకు మించి కోటా విడుదలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఇది కేవలం ఒక అనంతపురం జిల్లా పరిస్థితి మాత్రమే. అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చెరువుల్లో నీరు లేదు. 
 
విజయవాడ, విశాఖ పట్టణం వంటి నగరాలలో నదులు, సముద్రాలలో నీరు కలిపేస్తారేమోగానీ, మిగిలిన తిరుపతి, కడప, కర్నూల్, నెల్లూరు వంటి ప్రాంతాలలో నీటి కొరత ఎక్కువగానే ఉంది. కానీ వినాయక చవితి ఏర్పాట్లు మాత్రం ఘనంగా జరిగిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం వంటి చోట్ల సాగునీటి కాలువలు ఉన్నప్పటికీ అక్కడ కూడా తగిన ఎత్తులో నీరు లేదు. ఫలితంగా పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఫైరింజన్లతో తడిపి నిమజ్జనం చేసే పరిస్థితి ఏర్పడుతుందేమో.. 

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments