ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 నవంబరు 2016 (19:59 IST)

హీరో భర్తతో విడాకులు... పీకలకొద్దీ సిగరెట్లు తాగేస్తున్న హీరోయిన్

హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంటే బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ గుర్తుకు వస్తారు. దానికి కారణం వారిరువురూ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ అనే పేరు తెచ్చుకోవడమే. ఐతే వారిద్దరూ విడిపోయారు. కారణం ఏమయినప్పటికీ బ్రాడ్ పిట్ అందాల హీరోయిన్ ఏంజెలీనాను వదిలేయడంతో ఇప్ప

హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంటే బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ గుర్తుకు వస్తారు. దానికి కారణం వారిరువురూ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ అనే పేరు తెచ్చుకోవడమే. ఐతే వారిద్దరూ విడిపోయారు. కారణం ఏమయినప్పటికీ బ్రాడ్ పిట్ అందాల హీరోయిన్ ఏంజెలీనాను వదిలేయడంతో ఇప్పుడామె తీవ్ర ఒత్తిడికి లోనై చెయిన్ స్మోకర్‌గా మారిపోయిందట. పెట్టెలకొద్దీ సిగరెట్లు తాగేస్తోందట. 
 
ఆమె పరిస్థితి ఇలా ఉందని అమెరికాలోని ఓ వెబ్ సైట్ తెలిపింది. కాగా జోలీ క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలు. ఆమె పలు సర్జరీలు కూడా చేయించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె విపరీతంగా పొగతాగడం వల్ల ఆరోగ్యానికి అపాయమవుతుందని ఆమె స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ జోలీ మాత్రం అదేమీ లెక్కచేయడం లేదట.