సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (18:49 IST)

గంగ్నమ్ స్టైల్ అదుర్స్ రికార్డ్.. వారం రోజులు అలా వుండగలిగితే..?

gangnam style
బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానుల్ని పొగేసుకుంది. అయితే, ఏదో ఒక కారణం చేత నిత్యం వార్తల్లో నిలిచే బీటీఎస్ తాజాగా 'డైనమైట్' అనే పాటతో జనం నోళ్లలో నానుతోంది. బిల్ బోర్డ్ హాట్ 100 లిస్ట్‌లో ఇప్పటికి 31 వారాలుగా చెక్కు చెదరకుండా పాతకుపోయిన హిట్ సాంగ్... వరల్డ్ ఫేమస్ 'గంగ్నమ్ స్టైల్' రికార్డును సమం చేసింది. మరొక్క వారం బిల్ బోర్డ్ హాట్ 100 లిస్టులో ఉండగలిగితే బీటీఎస్ వారి 'డైనమైట్' వరల్డ్ నంబర్ వన్ అవుతుంది.
 
యూట్యూబ్‌లో 'డైనమైట్' సాంగ్ ఇప్పటికే 950 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టేసింది. బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్‌కు సంబంధించిన పాటల్లో, 'డైనమైటే'... బిల్ బోర్డ్ మెయిన్ సింగిల్స్ చార్ట్ లో నంబర్ వన్‌గా నిలిచిన మొట్ట మొదటి సాంగ్. తరువాత అనేక సూపర్ హిట్ నంబర్స్ క్రియేట్ చేశారు. అయితే, 'డైనమైట్' సాంగ్ క్రేజ్ ఎంతో మనకు తెలియటానికి మరొక్క విశేషం తెలుసుకోవాలి.
 
'డైనమైట్' సాంగ్ వీడియోలో బీటీఎస్ బ్యాండ్ సభ్యులు ప్రత్యేక ఔట్ ఫిట్స్ వేసుకున్నారు. వాటిని తరువాతి కాలంలో సొషల్ సర్వీస్ కోసం వేలం వేస్తే 1,62,500 అమెరికన్ డాలర్లు వసూల్ అయ్యాయి. ఇటు కొరియా, జపాన్, అటు అమెరికాలోనూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బీటీఎస్ బ్యాండ్ సింగర్స్ అండ్ మ్యుజీషియన్స్... సామాజిక అంశాల పైన కూడా విరివిగా స్పందిస్తూనే ఉంటారు. 
 
తాజాగా అమెరికాలో ఆసియా జాతీయులపై దాడుల్ని బీటీఎస్ ముక్త కంఠంతో ఖండించింది. ఇండియాలో మాత్రం బీటీఎస్ ప్రభావం ఇంకా పూర్తిగా కనిపించటం లేదనే చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రేజీ బ్యాండ్ కు మన దగ్గర ఆదరణ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.