సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (06:26 IST)

నేనెవడితో తిరిగితే మీకెందుకోయ్.. నా బయోడేటా మొత్తం కావాలా అంటున్న నటీమణి

చూస్తుంటే ప్రపంచమంతటా మీడియా వ్యవహారం కానీ, ప్రజల ఆలోచనలు కాని ఒకేలాగా కనిపిస్తున్నాయి. ఎవరు ఎవరితో రొమాన్స్ చేశారు, చేస్తున్నారు అనే కుతూహలం జాతి, దేశ, ఖండ భేదాలు లేకుండా ఖండాంతరాల్లో ఒకేవిధంగా ఉన్నట

చూస్తుంటే ప్రపంచమంతటా మీడియా వ్యవహారం కానీ, ప్రజల ఆలోచనలు కాని ఒకేలాగా కనిపిస్తున్నాయి. ఎవరు ఎవరితో రొమాన్స్ చేశారు, చేస్తున్నారు అనే కుతూహలం జాతి, దేశ, ఖండ భేదాలు లేకుండా ఖండాంతరాల్లో ఒకేవిధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. పలానా హీరోయిన్ పలానా వాడితో తిరుగుతోంది, పలానా యాంకర్ పలానా చోట కనిపించింది తరహా వార్తలు మన దేశానికే పరిమితంకాదు మన లాంటి బాపతు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారని కొ్న్ని ఘటనల బట్టి అర్థం చేసుకోవచ్చు. 
 
ఇక్కడ టాలివుడ్, కొలివుడ్, బాలివుడ్ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ల రొమాన్స్ డేటింగు గురించి కథలు కథలుగా ప్రచారంలో ఉన్నట్లే హాలీవుడ్‌లోను హీరోయిన్లు ఈ గుసగుసల బెడద నుంచి తప్పించుకోవడం లేదట. ఉదాహరణకు తాను ఎవరితో రొమాన్స్ చేశానన్న విషయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని హాలీవుడ్ నటి ఈజా గోంజాలెజ్ అంటోంది. ఈమె ఇలా చిర్రుబుర్రలాడటానికి ఓ కారణం ఉంది. 
 
ఆమె గత కొన్ని రోజులుగా డీజే కెల్విన్ హ్యారిస్ తో డేటింగ్ చేస్తోంది. అయితే వీరి ప్రేమాయణం గురించి ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఈ మెక్సికన్ సింగర్, నటి గోంజాలెజ్ పలు సందర్భాలలో ప్రియుడు హ్యారిస్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. గత వారం కూడా ఓ ఈవెంట్లో ఈ ఇద్దరూ జంటగా పాల్గొన్నారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నారని అందరూ భావించారు.
 
ప్రేక్షకులు, అభిమానులు నిజంగానే తనను ప్రేమించినట్లయితే తాను నటించిన మూవీలలో పాత్రల్లో మాత్రమే గుర్తుపెట్టుకుంటే బాగుండేదని హితవు పలికింది. అయితే తన సినిమాలకు బదులుగా కేవలం కాల్విన్ హ్యారిస్ గురించి మాత్రమే ఎందుకు పదే పదే అడుగుతారంటూ స్థానిక మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డేటింగ్, ప్రేమ, ఇతర వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను.. ఆ విషయాలను అందరికి చెప్పాల్సిన అవసరం తనకు లేదని మెక్సికన్ భామ గోంజాలెజ్ అభిప్రాయపడింది.