Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జామ ఆకుల టీ త్రాగండి.. అధిక బరువుని తగ్గించుకోండి

Written By ఎంజీ
Updated: సోమవారం, 20 సెప్టెంబరు 2021 (06:43 IST)
అధిక బరువుతో బాధ పడుతున్నారా? ఉదయం పూట వ్యాయామాలు ఏమి చేస్తాంలే అని చిరాకు పడుతున్నారా? డైటింగ్ చేద్దామనే తొక్కలో ఆలోచనలో పడ్డారా? తిండి తిప్పలు మానేసి రోగిష్టి బ్రతుకు బ్రతికే కంటే , కేలరీలు , విటమిన్ లు మీ చేతులారా వదిలేసుకోమాకండి.

అయితే, సులువైన పద్దతులని పాటించి మంచి బలంగా, ఆరోగ్యంగా, నిత్య యవ్వనంగా, నవ్వుతూ జీవితాన్ని సాఫీగా కొనసాగించండి.

అయితే చిన్న చిట్కా వైద్యం మీ పెరటు లోనే ఉంది. అదేమిటంటే జామ చెట్టు. ఒక వేళ మీ పెరటులోనే జామ చెట్టు ఉంటే ఇక ఎలాగెలో బరువు తగ్గడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ ని దూరంగా తరిమి తరిమి కొట్టవచ్చు.
 
గుప్పెడు జామాకులని తీసుకొని, వాటిని కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారు అవుతుంది. ఈ టీని సేవించడం ద్వారా బోలెడు బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించే అత్యున్నత శక్తి ఉంది. దీని ఫలితంగా చాలా సులువుగా బరువు తగ్గుతారు.

జామాకుల టీ ని త్రాగితే శ్వాస సంబందిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. జామాకులను శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి....నోటి పూత కూడా తగ్గుతుంది.

ఇందులో ఉండే యాంటి యాక్షిడెంట్లు నొప్పులు, వాపులు నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి కాస్త వగరుగా ఉన్నా వారానికి ఒక్క సారి కనీసం త్రాగండి. మీ జీవితాలను సుఖమయం చేసుకోండి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments