Dharma Sangrah

జలుబు, ఫ్లూ వ్యాధులు సోకకుండా ఎలా నివారించాలి?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 14 అక్టోబరు 2022 (20:35 IST)
జలుబు, జ్వరం, దగ్గు లేదా ఫ్లూ బారిన పడకుండా ఈ చర్యలు తీసుకోండి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి, కానీ నీటిని కాచి చల్లార్చి తాగాలని గుర్తుంచుకోండి. వెల్లుల్లి, మిరపకాయలు తినండి. వెల్లుల్లి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది, మిరపకాయ సైనస్ రద్దీని తగ్గిస్తుంది.

 
విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆహారంలో పుట్టగొడుగులు, నిమ్మ, తేనెను చేర్చండి. జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. రెడ్ మీట్, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు చేర్చండి. నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ సూప్ తీసుకోవచ్చు. ఇందులో సిస్టీన్ ఉంటుంది, ఇది కఫాన్ని వదలగొడుతుంది.

 
రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగాలి. కొద్దిగా ఉప్పు వేసి చిన్ని అల్లం ముక్క తినండి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ విషయంలో, ఆవిరి తీసుకోవడం ప్రారంభించండి. ముక్కు దిబ్బడగా వున్నప్పుడు ఆవిరిని పీల్చుకోండి. రోజంతా గోరువెచ్చని నీరు త్రాగాలి. గొంతు నొప్పిగా వుంటే నీటిని పుక్కిలించండి.

అన్నీ చూడండి

జిల్లాకు ముగ్గురు మంత్రులున్న ఒరింగేదేమీ లేదు : తెలంగాణ జనసేన నేతలు

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు - ఎస్ఎస్ టోకెన్ల జారీ నిలిపివేత

మైనర్ బాలికపై నెలలు తరబడి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా : అభిజీత్ దీప్కే

ఫ్రీ బస్సుల్లో సీట్ల లొల్లి - జట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు (వీడియో)

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments