Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఉపాసన వంటకం.. రాగి మాల్ట్ విత్ బటర్ మిల్క్.. ట్రై చేయండి..

Updated: బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (13:18 IST)
మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఆరోగ్యపరమైన చిట్కాలను పోస్టు చేస్తుంటారు. అలా ఉపాసన వేసవికాలానికి అనువుగా రాగి మాల్ట్ విత్ బటర్ మిల్క్ అనే రిసిపీ చేశారు. మజ్జిగతో రాగి జావ అని ఈ వంటకాన్ని చెప్పుకోవచ్చు. ఈ రాగి జావను సాయంత్రం పూట నాలుగు గంటలకు తీసుకోవచ్చునని.. ఉదయం 11 గంటల సమయంలో వేసవి కాలం తీసుకుంటే ఆరోగ్యానికి మేలే కాకుండా వేడి తగ్గించుకోవచ్చు. 
 
కావలసిన పదార్థాలు
రాగిపిండి - రెండు స్పూన్లు 
నీరు - రెండు కప్పులు 
మజ్జిగ - అరకప్పు 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం ముందుగా రాగిపిండిని జారుగా నీటిలో కలుపుకోవాలి. ఈ రాగి మిశ్రమాన్ని ప్యాన్‌లో వేడైన నీటితో కలిపి.. గట్టిపడకుండా కలుపుతూ వుండాలి. రెండు మూడు నిమిషాల పాటు రాగిపిండి ఆ నీటిలో ఉడికిన తర్వాత గిలకొట్టిన మజ్జిగను గ్లాసులోకి తీసుకుని అందులో ఈ రాగి జావను చేర్చాలి. ఉప్పు తగినంత చేర్చుకుని.. కొత్తిమీర తరుగుతో సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఉప్పు కలుపుకోవడం ఇష్టం లేకపోతే.. మజ్జిగతో కూడిన రాగిమాల్ట్‌ను పిల్లల కోసం బెల్లం, తేనెను కలుపుకుని సర్వ్ చేయొచ్చు. 
 
ఇందులోని పోషక విలువలు..
గ్లాసుడు రాగి మాల్ట్ విత్ బటర్ మిల్క్‌ను తీసుకుంటే.. 105 కెలోరీలు, 5.0 జీ ప్రోటీన్లు పొందవచ్చు. ఇందులో ఐరన్, క్యాల్షియం, విటమిన్ సీ పుష్కలంగా వుంటుంది. ఇంకా తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో గల యాంటీ-ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తుంది. క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments