సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (13:49 IST)

ఆకలేస్తే మసి తింటాడు.. దాహమైతే వేస్ట్ ఆయిల్ తాగుతాడు.. ఎవరు?

సాధారణంగా ప్రతి మనిషి ఆకలేస్తే భోజనం చేస్తాడు. దాహం వేస్తే నీళ్లు తాగుతాం. కానీ, ఆ వ్యక్తి మాత్రం ఆకలేస్తే కాగితాలను కాల్చగా వచ్చే మసి లేదా బూడిదను ఆరగిస్తాడు. అలాగే, దాహం వేస్తే మాత్రం నీటికి బదులు వేస్ట్ ఆయిల్ గటగటా తాగేస్తాడు. ఇలాంటి మనిషి కూడా మనమధ్య ఉన్నాడా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందా? నిజంగానే ఇలాంటి మనిషి ఉన్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాకు చెందిన కుమార అనే వ్యక్తి గత 17 యేళ్లుగా మసిని ఆరగిస్తూ, వేస్ట్ ఆయిల్‌ను సేవిస్తున్నాడు.
 
దీనిపై కుమార మాట్లాడుతూ, 17 యేళ్ల క్రితం ఓ వ్యక్తి తనకు పని ఇప్పిస్తానని చెప్పి షిమోగాకు తీసుకెళ్ళాడు. ఐదేళ్లపాటు పని చేయించుకుని పైసా జీతం ఇవ్వలేదు. దీంతో ఆకలిని తట్టుకోలేక తొలుత కాగితాలు తినేవాడిని. అక్కడ కంపెనీలో ఉండే వేస్ట్ ఆయిల్‌ను తాగేవాడిని. ఆపై కాగితాలను కాల్చిన తర్వాత నల్లటి మసిని ఎంతో ఇష్టంగా తినేవాడినన్నారు. ఎవరైనా డబ్బులను బిచ్చంగా వేస్తే కాఫీ, టీ మాత్రం తాగుతాను. పొరపాటున ఎవరైనా భోజనం చేయమని డబ్బులిస్తే కుమార మాత్రం హోటల్ వైపు కూడా కన్నెత్తి చూడడు. అదే ఎవరైనా పాతకాగితాలను ఇస్తే మాత్రం కోటి రూపాయలు ఇచ్చినంతగా సంబరపడిపోతాడు.