ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:52 IST)

మత్తు మందుచ్చి వంతులేసుకుని అత్యాచారం.. కారులోనే..?

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళపై అఘాయిత్యం చోటుచేసుకుంది. సహ ఉద్యోగినిపై కన్నేసిన ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం ఆఫీసు ముగిసిన తర్వాత.. ఇంటికి వెళ్ళేటప్పుడు, సహోద్యోగులు ఇద్దరు కారులో ఎక్కండి.. లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. ఆమె కూడా సహోద్యోగులే కదా అని కారులో ఎక్కింది. 
 
కొద్ది దూరం వెళ్తుండగా యువతికి కూల్ డ్రింక్ ఇచ్చారు. దాన్ని తీసుకున్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసుపై విచారణను ముమ్మరం చేశామన్నారు.