ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (14:00 IST)

బావి వద్దకు వెళ్లిన యువతిపై అత్యాచారం.. హత్య

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామచంద్రాపురంలో గ్రామానికి చెందిన కురా మహంతి, రాధామణిల కుమార్తె కనకలత (22). మహంతి వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కనకలత, విద్యా వలంటీర్‌గా పనిచేస్తోంది. నిత్యమూ ఊరు బయట ఉన్న బావి వద్దకు వెళ్లి స్నానం చేసి రావడం కనకలత, రాధామణిలకు అలవాటు. 
 
శనివారం మాత్రం కనకలత ఒంటరిగా స్నానానికి వెళ్లి, బకెట్ం దుస్తులు రహదారిపై ఉంచి, పక్కనే ఉన్న ఓ తోటలోకి బహిర్భూమి నిమిత్తం వెళ్లింది. ఆమె దుస్తులు చాలా సేపు రోడ్డుపైనే ఉండటంతో స్థానికులు తోటలోకి వెళ్లి చూడగా, ఆక్కడ కనకలత మృతదేహం లభించింది. 
 
ఆమె మెడకు ఓ టవల్‌ను గట్టిగా బిగించి హత్య చేసినట్టు కనిపించగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్‌తో పాటు పోలీసు జాగిలాలను పిలిపించి పరిసరాలు గాలించారు. హత్యానేరంగా కేసును నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.