Daily Horoscope
✕

ఎయిర్ కూలర్‌ను వినియోగించినప్పుడు తలుపులు, కిటికీలను?

ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ఐతే ఈ చిట్కాలు పాటించండి. ఎయిర్ కూలర్‌లో నీళ్లు తగ్గిపోతే వెంటనే వాటర్ మోటర్‌ను ఆఫ్ చేయాలి. లేనట్లైతే మోటార్ పాడైపోతుందట. అలాగే కూలర్ ఆన్‌లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత

Written By selvi
Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (12:30 IST)
ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ఐతే ఈ చిట్కాలు పాటించండి. ఎయిర్ కూలర్‌లో నీళ్లు తగ్గిపోతే వెంటనే వాటర్ మోటర్‌ను ఆఫ్ చేయాలి. లేనట్లైతే మోటార్ పాడైపోతుందట. అలాగే కూలర్ ఆన్‌లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల నీరు ఫ్యాన్ మోటార్, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలపై చిమ్మి.. పాడైపోయే అవకాశం ఉంటుంది. 
 
ఎయిర్ కూలర్లను రెగ్యులర్‌గా వాడుతున్నప్పుడు కనీసం ఐదారు రోజులకోసారి ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా తీసేసి, డిటర్జెంట్‌తో కడిగి శుభ్రం చేసుకోవాలి. తద్వారా నీటిలో ప్రమాదకర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపుతుండడం వల్ల కూలర్ల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అవసరమైతే కూలర్ సెంట్లు వినియోగించుకోవచ్చు. కూలర్లలో కూలింగ్ ప్యాడ్‌లు పూర్తిగా తడుస్తున్నాయా, లేదా చూసుకోవాలి. కూలింగ్ ప్యాడ్లు పూర్తిగా తడవకపోయినా, వాటి మధ్య ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్నా గాలి చల్లగా రాదు. 
 
ఎయిర్ కూలర్‌ను వినియోగించినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంటే ఇంట్లో తేమ శాతం పెరిగిపోతుంది. దాంతో చల్లదనం కాదుకదా.. తీవ్రంగా ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. దీనికి పరిష్కారం మంచి వెంటిలేషన్ ఉండటమేనని వైద్యులు చెప్తున్నారు. ఇంట్లోని గాలి బయటికి, బయటిగాలి ఇంట్లోకి వచ్చేలా వెంటిలేషన్ ఉంటే.. ఎయిర్ కూలర్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. 

అన్నీ చూడండి

పాకిస్థాన్ పైలెట్లపై నిషేధం - ఎయిర్ ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

మార్చ్ ఫర్ డెమోక్రసీపై వివరణ ఇవ్వండి.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఆగ్రహం

నాలోని రగ్గడ్ లుక్‌ను బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది.. కేటీఆర్ (video)

పాఠశాల పై కప్పుకూలి 29 మంది మృత్యువాత .. ఎక్కడ?

మీకు ఎంత చెప్పినా అర్థం కాదా : విద్యుత్ శాఖ అధికారులపై సీఎం రేవంత్ మండిపాటు

అన్నీ చూడండి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

Sunil : డ్యూ డేట్‌లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో సునీల్‌

Karikala launch: కరికాల నా కెరీర్ బెస్ట్ అవుతుంది - చిత్ర ప్రారంభోత్సవంలో సందీప్ కిషన్

Rajani: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం అవుతుంది - రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments