శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:23 IST)

సీటు ఇవ్వలేదని స్వీయ నిర్బంధంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే...

ఓదేలుకు ఓదార్పు లేదా? తనకు టికెట్ కేటాయించలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు గృహ నిర్బంధం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గృహ నిర్బంధంలోకి వెళ్లిన ఓదేలు తనకు చెన్నూర్ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమ న

ఓదేలుకు ఓదార్పు లేదా? తనకు టికెట్ కేటాయించలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు గృహ నిర్బంధం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గృహ నిర్బంధంలోకి వెళ్లిన ఓదేలు తనకు చెన్నూర్ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమ నాయకుడు గృహనిర్బంధంలోకి వెళ్లడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
 
తలుపులు తీయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఎంత సముదాయించే ప్రయత్నం చేసినా ఓదేలు మాత్రం డోర్లు తీయడం లేదు. మూడుసార్లు గెలిచిన తనకు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ సీటు నిరాకరించిందో అర్థం కావడం లేదని ఓదేలు వాపోతున్నారు. పార్టీ మారే ఆలోచన లేదని కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఓదేలు చెప్పడం విశేషం.. మరి టీఆర్ఎస్ నాయకులు ఓదేలును ఎలా ఓదారుస్తోరో చూడాలి.