సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (13:04 IST)

చైనా స్కూలులో మంటలు.. 13మంది సజీవ దహనం

fire accident
చైనాలోని హెనాన్ ప్రావిన్స్ స్కూలుకు చెందిన వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. యన్షాన్పు గ్రామంలోని యింగ్‌కై స్కూల్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్కూలుకు చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
మంటల్లో చిక్కుకున్న 13 మంది విద్యార్థులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.