సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (15:46 IST)

చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాక్ చెఫ్ కన్నుమూత

Ahmed Aslam Ali
Ahmed Aslam Ali
చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకిస్థాన్ చెఫ్ కన్నుమూశారు. మరణించేనాటికి ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ప్రపంచ దేశాలకు చెందిన పాకశాస్త్ర నిపుణులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అలీ అహ్మద్ అస్లామ్ చికెన్ టిక్కా మసాలాను కనుగొన్నాడు. అతను చిన్న వయస్సులోనే పాకిస్తాన్ నుండి స్కాట్లాండ్‌కు వెళ్లాడు. 
 
స్కాట్లాండ్‌లో వంట గురించి కొంచెం నేర్చుకున్నాడు, తందూరీ ఓవెన్‌లో మొదటిసారి చికెన్ టిక్కా మసాలా చేయవచ్చని కనుగొన్నాడు. ఆ తర్వాతే ఈ ఆహారం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గమనార్హం. చికెన్ టిక్కా మసాలాను కనిపెట్టిన పాకశాస్త్రజ్ఞుడు మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.