పాకిస్థాన్‌తో టెస్టు: నాలుగు సెంచరీలు-ఇంగ్లండ్ సరికొత్త రికార్డ్
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టు మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లీష్ క్రికెటర్లు నాలుగు సెంచరీలతో అదరగొట్టారు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించారు. 2005కి తర్వాత ఇంగ్లండ్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.
ఈ నేపథ్యంలో రావల్పిండిలో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌కు బెన్‌స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
కాగా, ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. వీరిలో జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107), ఒలీ పోప్ (108), హ్యారీ బ్రూక్ (101) సెంచరీలు చేయడంతో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.