శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (14:48 IST)

ఆస్ట్రేలియాలో అశ్లీల వీడియోలతో పట్టుబడ్డ ఇండియన్... రూ. 3.75 కోట్ల జరిమానా?

ఆస్ట్రేలియాలో ఒక భారతదేశ యువకుడు ఆ దేశ నిబంధనలు తెలియకపోవడంతో చిక్కుల్లో పడ్డాడు. ఫోన్లో అశ్లీల వీడియోలను ఉంచుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గత శనివారం నాడు పెర్త్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. 
 
32 రెండేళ్ల భారతీయుడు కౌలాలంపూర్ నుండి ఆస్ట్రేలియాకి వెళ్లాడు. అక్కడ పెర్త్ విమానాశ్రయంలో దిగిన అతడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. లగేజీలో అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదు. కానీ అధికారులు తన రెండు మొబైల్ ఫోన్‌లను ఓపెన్ చేసి చూడగా అశ్లీల వీడియోలు ఉండటంతో ఖంగుతిన్నారు. ఆ యువకుడికి చెందిన ఫోన్‌లో ఐదు వీడియోలను కనుగొన్నారు. వాటిలో రెండు చిన్నపిల్లలతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు. వెంటనే ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. 
 
సాధారణంగా అస్ట్రేలియా చట్టాల ప్రకారం అలాంటి వీడియోలను దేశంలోకి తీసుకురావడం నిషిద్ధం. పోలీసులు నేరస్తుడిని ఆదివారం పెర్త్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న అతనికి దాదాపు 3.75 కోట్ల రూపాయల జరిమానా కానీ లేదా పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అస్ట్రేలియా నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే దేశంలోకి రావాలని హెచ్చరిస్తున్నారు. చాలా దేశాల మాదిరిగానే ఆస్ట్రేలియా కూడా అశ్లీల వీడియోలను నిషేధించిందని చెప్పుకొచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని కూడా చెప్పారు.