శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (19:13 IST)

శతాబ్ది కంటే వేగంగా నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వే జాబితాలో మరో రైలు చేరనుంది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు పేరుంది. దీనికంటే వేగంగా మరో రైలును ప్రవేశపెట్టనుంది. దీనికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేశారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఈ తరహా రైలును తొలుత ఢిల్లీ - వారణాసిల మధ్య ప్రవేశపెట్టనున్నారు. 
 
మూడు దశాబ్దాల క్రితం ఇండియన్ రైల్వేలో ప్రవేశించిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సక్సెసర్‌గా దీనిని తీసుకొస్తున్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 
 
మొత్తం రూ.97 కోట్ల వ్యయంతో రాయ్‌బరేలీలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కేవలం 18 నెలల్లోనే దీనిని తయారు చేశారు. దేశంలోని తొలి ఇంజిన్ లెస్ (లోకోమెటివ్ లేని) రైలుగా ఇది గుర్తింపు పొందనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలుకు పేరు పెట్టాల్సిందిగా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు కోరింది. వేలాదిమంది పలు పేర్లు సూచించినప్పటికీ చివరికి 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'గా పేరు పెట్టినట్టు మంత్రి గోయల్ వెల్లడించారు.